Annadanam for Srisailam Padayatra Devotees by Sai Nagar Yadava Committee

10, Feb 2026 Achampet 176 Views

శ్రీశైలం పాదయాత్ర భక్తులకు అన్నదాన వితరణ: సాయినగర్ యాదవ ఉత్సవ కమిటీ సేవా తత్పరత

> శివ భక్తులకు అన్నదాన వితరణ - యాదవ కమిటీ సేవలు.

> శ్రీశైలం పాదయాత్రలో ‘అన్నదాత’ సాయినగర్ యాదవ కమిటీ.

> మూడు రోజుల పాటు నిత్యాన్నదానం - భక్తుల తాకిడి.

> మల్లన్న భక్తులకు సేవ చేయడం మా అదృష్టం: యాదవ సంఘం.

అచ్చంపేట: మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల మల్లన్న దర్శనానికి కాలినడకన వెళ్లే శివ భక్తుల కోసం సాయినగర్ యాదవ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గత మూడు సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ సేవలను అందిస్తున్న కమిటీ, ఈ ఏడాది కూడా మూడు రోజుల పాటు నిత్య అన్నదాన వితరణ చేపట్టనున్నట్లు ప్రకటించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ రామనాథం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శేఖరాచారి, మాజీ సర్పంచ్ కంచరమయ్య, సీనియర్ నాయకులు నరేష్ యాదవ్ హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రాల లాలూ యాదవ్, వర్థం మల్లయ్య యాదవ్ తదితరులు మాట్లాడుతూ.. శివ భక్తులకు సేవ చేయడం తమ అదృష్టమని, మూడు రోజుల పాటు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భోజన వసతులు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మంత్రాల ఆంజనేయులు, కోడెల మల్లయ్య, జితేందర్, ఈశ్వర్ యాదవ్ మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Sai Nagar Yadava Utsava Committee Organizes Annadanam for Srisailam Devotees

Achampet: On the eve of Maha Shivaratri, the Sai Nagar Yadava Utsava Committee has organized a grand 'Annadanam' (food distribution) program for devotees heading to Srisailam on foot (Padayatra). This marks the third consecutive year the committee has undertaken this noble initiative.

The organizers announced that the daily food distribution will continue for three days to serve the thousands of Shiva Swamis passing through the route. Former MPP Ramanadham, Senior Congress leader Shekharachari, Former Sarpanch Kancharamayya, and Senior leader Naresh Yadav attended as chief guests and lauded the committee's efforts. Organizers Mantrala Lalu Yadav, Varadam Mallaiah Yadav, and others ensured all arrangements were in place. Committee members and local leaders actively participated in serving the devotees.

TAGS: Srisailam Padayatra Annadanam 2026, Sai Nagar Yadava Committee Achampet, Maha Shivaratri Food Distribution, Shiva Bhaktula Annadanam, Achampet Local News, Sai Nagar Yadava Utsava Committee, Annadanam for Srisailam devotees, Maha Shivaratri Annadanam Achampet, Srisailam Padayatra devotees food distribution, Shiva Swamis Annadanam, Achampet religious service news, Yadava community service Telangana, Srisailam foot pilgrims support, Achampet Maha Shivaratri events, Ramanadham former MPP, Shekharachari Congress leader, Yadava Utsava Committee Achampet
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com