అచ్చంపేటలో పుట్టపాక మహేందర్ నాథ్ వర్ధంతి.. నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

17, Jul 2026 Achampet 176 Views
Late Puttapaka Mahender Nath 21st Death Anniversary Observed in Achampet

అచ్చంపేటలో ఘనంగా స్వర్గీయ పుట్టపాక మహేందర్ నాథ్ గారి 21వ వర్ధంతి వేడుకలు


అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలో స్వర్గీయ శ్రీ పుట్టపాక మహేందర్ నాథ్  21వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అచ్చంపేట ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ  ఆదేశాల మేరకు.. అచ్చంపేట కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ఖాదర్బాయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహేందర్ నాథ్  చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత మల్లేష్, అచ్చంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుచ్చి రాములు విచ్చేశారు. వారితో పాటు INTUC తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండూరు శేఖర్, 9వ వార్డు కాంగ్రెస్ ఇన్చార్జ్ రాములు, బీసీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ తిరుపతయ్య గౌడ్ పాల్గొన్నారు.

అలాగే మాజీ కౌన్సిలర్ గౌరీ శంకర్, INTUC మండల అధ్యక్షులు మౌలానా, INTUC టౌన్ అధ్యక్షులు సలేశ్వరం, ఉమామహేశ్వర టెంపుల్ డైరెక్టర్ పవన్ కుమార్, 20వ వార్డు ఇంచార్జ్ లక్ష్మణ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు విష్ణు తదితరులు పాల్గొని ఈ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా స్వర్గీయ మహేందర్ నాథ్ గారు చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.

Tags: Achampet, Achampet News, Puttapaka Mahender Nath, Mahender Nath 21st Death Anniversary, Puttapaka Mahender Nath Death Anniversary, Achampet Congress, Achampet Congress Town President, Chikkudu Vamshi Krishna, Congress Tribute Program, Rajitha Mallesh, Buchi Ramulu, INTUC Achampet, Achampet Market Committee, Telangana Congress News, Mahender Nath Memorial Program
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com