అమ్రాబాద్ (అచ్చంపేట), మే 18, 2026: ఎండ తీవ్రతకు నల్లమల అడవుల్లో సంభవించే అగ్నిప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) మరియు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఒక భారీ నమూనా వ్యాయామం (మాక్ డ్రిల్) నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ పరిధిలోని ‘రాసనుల బావి’ వద్ద ఈ కార్యక్రమం జరిగింది.
వేసవి కాలంలో అడవుల్లో అకస్మాత్తుగా చెలరేగే మంటలను ఎలా అదుపు చేయాలి, వన్యప్రాణులను మరియు అటవీ సంపదను ఎలా రక్షించాలనే అంశాలపై క్షేత్రస్థాయిలో ఈ శిక్షణ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్‌లో అటవీశాఖ అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ (SDRF) ఫైర్ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు పోలీస్ అధికారులు సంయుక్తంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు.
ప్రమాదం జరిగినప్పుడు వివిధ ప్రభుత్వ విభాగాలు ఎలా సమన్వయంతో పనిచేయాలి, క్షతగాత్రులకు ఎలాంటి అత్యవసర వైద్య సహాయం అందించాలనే విషయాలపై లైవ్ డెమో నిర్వహించారు. నల్లమల అడవుల రక్షణకు ఇటువంటి ముందస్తు విపత్తు నిర్వహణ వ్యాయామాలు ఎంతో దోహదపడతాయని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com