పుల్జాలలో నాగర్‌కర్నూల్ పోలీస్, షీ టీమ్ అవగాహన సదస్సు | Nagarkurnool Police News

17, Jul 2026 Achampet 176 Views
Nagarkurnool Police Conducts 'Public Safety' Awareness Drive in Puljala

పుల్జాల గ్రామంలో నాగర్‌కర్నూల్ పోలీస్, షీ టీమ్ ఆధ్వర్యంలో 'ప్రజా భద్రత–పోలీసు బాధ్యత' అవగాహన సదస్సు

అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్.పి. శ్రీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ IPS  ఆదేశాల మేరకు, అచ్చంపేట పోలీసు స్టేషన్ పరిధిలోని పుల్జాల గ్రామంలో "ప్రజాభద్రత–పోలీసు బాధ్యత" పేరిట షీ టీమ్ (SHE Team) మరియు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భారీ సామాజిక అవగాహనా కార్యక్రమం శుక్రవారం (17.07.2026) నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఇన్స్పెక్టర్ నాగరాజు, షీ టీమ్ ఇంచార్జీ విజయలక్ష్మి (ASI), పోలీసు కళాబృందం పాల్గొని వివిధ సామాజిక అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అచ్చంపేట సీఐ నాగరాజు  మాట్లాడుతూ.. జిల్లాను నేర రహితంగా మార్చడమే ఎస్పీ  ముఖ్య సంకల్పమని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా, నిర్బంధ కార్మిక వ్యవస్థపై సమాచారం ఉంటే డయల్ 100కు తెలపాలని కోరారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నెంబర్‌ను ఆశ్రయించాలని, గుర్తుతెలియని లింకులు, క్యూఆర్ కోడ్‌లు స్కాన్ చేయవద్దని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం తెలిస్తే 1908 నెంబర్‌కు కాల్ చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలను నివారించాలని కోరారు.

అనంతరం షీ టీమ్ ఇంచార్జ్ ఏఎస్ఐ విజయలక్ష్మి మాట్లాడుతూ.. బాలబాలికలు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత భవిష్యత్తును అందుకోవాలని సూచించారు. మహిళలు, అమ్మాయిలను మాయమాటలతో అక్రమ రవాణా చేసే ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వేధింపులు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే షీ టీమ్ నెంబర్ 8712657676 కు సంప్రదించాలన్నారు. బాల్య వివాహాల నిరోధానికి చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు కాల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం సభ్యులు బుద్దుల భాస్కర్ & టీమ్ తమ ఆటపాటలతో గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వివరించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు పద్మ, తిరుపతి నాయక్, లక్ష్మయ్య, కానిస్టేబుళ్లు వెంకటేష్ నాయక్, మల్లేష్, రవికుమార్ మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: Puljala Village News, Achampet News, Nagarkurnool Police, She Team Awareness Program, Public Safety Police Responsibility, Achampet Police Station, Cyber Crime Awareness Telangana, Women Safety Telangana, Child Marriage Prevention, Human Trafficking Awareness, Drug Abuse Awareness, Minor Driving Awareness, Drunk and Drive Awareness, Nagarkurnool SP Sangram Singh G Patil, Achampet CI Nagaraju, SHE Team Vijayalakshmi, Telangana Police Awareness Program
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com