కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ మూడు నెలల క్రితమే రద్దయిందని, ప్రస్తుతం జిల్లాకు ఎలాంటి అధికారిక కమిటీ లేదని నాగర్‌కర్నూల్ జిల్లా మహాసభ కన్వీనర్ మాచిపెద్ది శివకుమార్ స్పష్టం చేశారు. శనివారం కల్వకుర్తి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు తానూ జిల్లా కన్వీనర్‌గా నియమితుడైనప్పుడే పాత జిల్లా కమిటీ రద్దయిందని శివకుమార్ గుర్తుచేశారు. ఆ సమయం నుంచే పాత కమిటీ రద్దయిన విషయాన్ని సభ్యులంతా గమనించాలని కోరారు.
కమిటీ ఇప్పటికే రద్దయినప్పటికీ, కొందరు వ్యక్తులు తామే అధ్యక్షుడిగా, కార్యదర్శిగా, ప్రచార కార్యదర్శిగా చెలామణి అవుతూ ప్రచారం చేసుకుంటున్నారని, ఇది ఎంతమాత్రం సబబు కాదని శివకుమార్ హితవు పలికారు. ఇకముందు ఎవరూ తమను తాము జిల్లా బాధ్యతులుగా ప్రకటించుకోవద్దని హెచ్చరించారు.
రాష్ట్ర కమిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలోనే పారదర్శకంగా నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు హకీం రాజేష్, రాష్ట్ర కార్యదర్శి బలుస శ్రీరాములు, మహాసభ బిల్డింగ్ కమిటీ చైర్మన్ చంద్రకుమార్, పొలిటికల్ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ కొండూరి గోవర్ధన్, మాజీ అదనపు కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, వైశ్య సంఘం నాయకులు సురేష్, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com