'మోతవరి లవ్ స్టోరీ' నటుడు చిరుత బాలరాజుకు ఘన సన్మానం: డైరెక్టర్‌గా ఎదగాలని ఆకాంక్ష

27, Aug 2025 Lingal 176 Views
 'మోతవరి లవ్ స్టోరీ' నటుడు చిరుత బాలరాజుకు ఘన సన్మానం...

అచ్చంపేట/అప్పయ్యపల్లి:

నల్లమల్ల ముద్దుబిడ్డగా, అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన యువ నటుడు చిరుత బాలరాజును యూత్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.

ఇటీవల విడుదలైన 'మోతవరి లవ్ స్టోరీ' అనే సినిమాలో ప్రముఖ పాత్ర పోషించిన అప్పయ్యపల్లి గ్రామ వాసి అయిన చిరుత బాలరాజును... ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు... యూత్ కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్ సన్మానించారు.

డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్ మరియు అప్పయ్యపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా బాలరాజుకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.

రాబోయే కాలంలో డైరెక్టర్‌గా ఎదగాలి:

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ రాథోడ్ మాట్లాడుతూ.. చిరుత బాలరాజు స్వయంకృషితో ఎదిగి, అచ్చంపేటకు మంచి గుర్తింపు తీసుకువచ్చారని ప్రశంసించారు. రాబోయే కాలంలో బాలరాజు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ముఖ్యంగా డైరెక్టర్‌గా ముందుకు రావాలని ఆకాంక్షించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో అప్పాయిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మొగిలి నిరంజన్, మూడవత్ కృష్ణ, రామావత్ చందర్, బెక్కెం నరేష్, గంజి భాస్కర్, కమ్మరి గోవర్ధన్, నర్స నాగయ్య, సత్యం, మార్కం పర్వతాలు, గార్లపాటి కాశీనాధం, మొగిలి మహేష్, మర్రిపల్లి రాజు, మాదగౌని రాజు, మూడవత్ శ్రీను, సంతోష్, పెయింటర్ శీను, మూడవ చంద్రశేఖర్, దుర్గ ప్రసాద్, కేతావత్ గీలో, తదితర యువ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

TAGS: Chirutha Balraju Actor, Mothavari Love Story, Srinivas Rathod Felicitation, Appayyapally Achampet, Youth Congress Secretary, Actor Chirutha Balraju, Chirutha Balraju actor, Chirutha Balraju Appayyapally, Achampet actor news, Appayyapally Achampet, Youth Congress felicitation, Dr Srinivas Rathod, Youth Congress National Secretary, Telangana film industry news, aspiring film director, actor turned director, youth achievements Telangana, Congress leaders encouragement, cultural achievements Achampet, local talent Telangana, Achampet news, Telangana youth success stories

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com