30ft Shiva Lingam at Umamaheshwaram Temple

14, Feb 2026 Achampet 176 Views

ఉమామహేశ్వరంలో 30 అడుగుల శివలింగ ప్రతిమ ఆవిష్కరణ: పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

అచ్చంపేట: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఆలయ కొండపై నూతనంగా విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేసిన 30 అడుగుల భారీ శివలింగ ప్రతిమను ఆయన ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు వనపర్తి జిల్లా డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డి కూడా పాల్గొన్నారు.

శివరాత్రి సందర్భంగా నియోజకవర్గ మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆ పరమశివుని కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అచ్చంపేట ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరిపై పరమేశ్వరుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

MLA Dr. Vamsi Krishna Unveils 30-Foot Shiva Lingam Statue at Umamaheshwaram Temple

Achampet: On the eve of Maha Shivaratri, Achampet MLA Dr. Chikkudu Vamsi Krishna visited the historic Sri Umamaheshwara Swamy Temple, known as the Northern Gateway to Srisailam. After performing special prayers to the deity, the MLA inaugurated a newly installed 30-foot Shiva Lingam statue, beautifully illuminated with electric lights, on the temple hill.

Dr. Vamsi Krishna was joined by Wanaparthy District DCC President Shivasena Reddy.

MLA's Message: Wishing the people of Achampet and Telangana a blessed Maha Shivaratri, the MLA prayed for the well-being and prosperity of all citizens. He expressed his hope that the grace of Lord Shiva would bring peace and happiness to every household, ensuring that the region remains fertile and prosperous.

TAGS: Achampet news, Umamaheshwaram Temple Achampet, Maha Shivaratri Achampet, Shiva Lingam statue inauguration, 30 feet Shiva Lingam Achampet, Dr Vamsi Krishna Achampet, Achampet MLA Dr Chikkudu Vamsi Krishna, Northern Gateway of Srisailam, Umamaheshwaram temple events, Shiva temple Telangana, religious events Achampet, Telangana temple news, Shiva worship Achampet, spiritual events Nallamala, Achampet religious news
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com