చింతలోనిపల్లిలో మంచినీటి సమస్య పరిష్కారం - ఎమ్మెల్యే వంశీకృష్ణ చొరవ

22, Mar 2026 Achampet 176 Views
Villagers celebrating the successful drilling of a new borewell in Chintalonipally village.

చింతలోనిపల్లిలో తీరిన దశాబ్ద కాలపు దాహార్తి: ఎమ్మెల్యే వంశీకృష్ణ చొరవతో కొత్త బోరుబావి ఏర్పాటు

అమ్రాబాద్: అమ్రాబాద్ మండలంలోని చింతలోనిపల్లి గ్రామ ప్రజల సుదీర్ఘకాలపు మంచినీటి సమస్యకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పరిష్కారం చూపారు. గత 10 సంవత్సరాలుగా గ్రామంలో కేవలం ఒకే బోరు ఉండటంతో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఎస్సీ సెల్ తాలూకా అధ్యక్షులు చింతల రాజగోపాల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

సమస్యపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ, కొత్త బోరు వేయించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈరోజు గ్రామంలో కొత్త బోరుబావిని తవ్వించారు. నీరు పడటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల నాటి సమస్యను వెంటనే పరిష్కరించినందుకు చింతల రాజగోపాల్ మరియు గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

TAGS: Vamsi Krishna borewell Chintalonipally, Amrabad water problem solution MLA, Chintala Rajagopal SC Cell request borewell, drinking water issue solved Amrabad village, Telangana rural water development news, Achampet MLA public service works, Nagarkurnool district water crisis relief, borewell installation Chintalonipally village, Amrabad mandal development works, Telangana village drinking water solution

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com