అచ్చంపేట సాయినగర్ కాలనీలో అగ్నిప్రమాదం - ఎమ్మెల్యే వంశీకృష్ణ పరామర్శ

28, Mar 2026 Achampet 176 Views
MLA Dr. Chikkudu Vamsi Krishna handing over financial aid to the fire accident victims in Achampet.

సాయినగర్ కాలనీలో అగ్నిప్రమాదం: బాధితులను పరామర్శించి, ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట: స్థానిక సాయినగర్ కాలనీలో విషాదం నెలకొంది. కాలనీకి చెందిన నూకల రాములు, శాంతమ్మ అనే నిరుపేద దంపతుల గుడిసె ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో వారి నివాసం పూర్తిగా దగ్ధమై, నిత్యావసర వస్తువులతో పాటు సర్వం కోల్పోయి ఆ కుటుంబం రోడ్డున పడింది.

విషయం తెలుసుకున్న అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు తక్షణమే బాధితుల వద్దకు చేరుకున్నారు. కాలిపోయిన గుడిసెను పరిశీలించి, బాధితులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పడమే కాకుండా, తక్షణ సహాయం కింద ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు ఆర్‌డీఓ (RDO)తో ఫోన్‌లో మాట్లాడి, బాధితులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం మరియు ఇందిరమ్మ ఇల్లుకు సంబందించిన బిల్లు మంజూరు అయ్యేలా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ రామనాధం, 2 వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మంతాల లాలూ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

TAGS: Sai Nagar Colony fire accident Achampet, Dr. Chikkudu Vamsi Krishna fire victims support, Achampet fire accident news Telangana, hut fire incident Nukala Ramulu Shantamma, Garlapati Srinivas municipal chairman visit, Nagarkurnool district fire accident relief, Telangana MLA financial aid victims, Achampet colony fire damage report, government compensation fire victims Telangana, Sai Nagar Achampet emergency incident news
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com