ఆత్మకూరు: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని జూరాల వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లిన ఓ డిగ్రీ విద్యార్థి నీటిలో మునిగి గల్లంతై ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది.
బాధితుడు నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వట్వర్లపల్లె గ్రామానికి చెందిన జాఫర్ (19)గా పోలీసులు గుర్తించారు. స్థానిక బీసీ హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న జాఫర్, స్నేహితులతో కలిసి స్నానానికి జూరాల కృష్ణానదికి వెళ్లాడు. నదిలో స్నానం చేస్తుండగా నీటి ప్రవాహానికి అదుపుతప్పి మునిగిపోయాడు.
సమాచారం అందుకున్న తెలంగాణ ఫైర్ & డిజాస్టర్ రెస్పాన్స్ (TG Disaster Response) బృందాలు మరియు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సుదీర్ఘ గాలింపు అనంతరం జాఫర్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కుమారుడు నదిలో మునిగి మృతి చెందడంతో వట్వర్లపల్లెలోని అతని కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com