ఆర్టీసీ సమ్మె విరమణ.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఐఎన్టీయూసీ (INTUC)

24, Apr 2026 Achampet 176 Views
INTUC leaders celebrating the resolution of the RTC strike in Achampet.

ఆర్టీసీ కార్మికుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డికి ఐఎన్టీయూసీ ధన్యవాదాలు!

అచ్చంపేట: ఆర్టీసీ కార్మికుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించి సమ్మె విరమణకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు ఐఎన్టీయూసీ (INTUC) తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారని కొనియాడారు. సమస్యల పరిష్కార బాధ్యతను భట్టి విక్రమార్కకు అప్పగించగా, ఆయన పెద్దమనసుతో ఆలోచించి డిమాండ్లను దశలవారీగా తీరుస్తామని హామీ ఇచ్చి సమ్మెను విరమింపజేశారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కార్మికులు 30-40 రోజులు సమ్మె చేసినా పట్టించుకోలేదని, కార్మికులను రోడ్డున పడేసి భిక్షాటన చేసేలా చేశారని ఆయన విమర్శించారు.

సమ్మె విరమణలో సహకరించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు అచ్చంపేట ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు ఐఎన్టీయూసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పునుంతల మండల అధ్యక్షులు రామచంద్రయ్య, బల్మూరు మండల అధ్యక్షులు చందు నాయక్, అచ్చంపేట టౌన్ అధ్యక్షులు గౌస్ పాషా, మౌలానా, స్వామి గౌడ్, ఉస్మాన్, వెంకటేష్, రాములు తదితరులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.

TAGS: Achampet RTC strike end news, Achampet INTUC thanks CM, Revanth Reddy RTC decision, Bhatti Vikramarka RTC talks, Telangana RTC workers news, Achampet latest news, Nagarkurnool RTC update, INTUC leaders Telangana, RTC strike success Telangana, Telangana Congress government news, RTC workers support government, transport minister Ponnam Prabhakar news, Vamsi Krishna MLA Achampet news, Telangana labour union news, RTC employees issues solved, bus workers Telangana update, Achampet political news, Nagarkurnool district news today, Telangana latest news update, RTC strike resolution India

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com