వెల్టూర్ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ - ఉప్పునుంతల మండలం

25, Nov 2025 Uppununthala 176 Views
మహిళా సంక్షేమానికి పెద్ద పీట: వెల్టూర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ
ఉప్పునుంతల మండలం, వెల్టూర్:

ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో మంగళవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట 'ఇందిరా మహిళా శక్తి పథకం' కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ చీరలను గ్రామ నాయకులు, మహిళా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న పలువురు నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అందిస్తున్న ప్రాధాన్యత గురించి మాట్లాడారు.

సీఎం లక్ష్యం: కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయడం

నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించేందుకు అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందని కొనియాడారు.

నాణ్యతతో కూడిన చీరలు, వడ్డీ లేని రుణాలు:

గతంలో నాణ్యత లేని చీరలు పంపిణీ చేశారని, అవి చివరికి పంట పొలాల చుట్టూ కాపలాగా మాత్రమే ఉపయోగపడ్డాయని నాయకులు ఎద్దేవా చేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీర ప్రతి ఒక్క మహిళా కట్టుకునే విధంగా అత్యంత నాణ్యతతో కూడుకుని ఉందని మహిళలకు తెలియజేశారు. ఇది మాత్రమే కాకుండా, మహిళలకు వడ్డీ లేని రుణాల విడుదలతో పాటు, ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డులు, వంట గ్యాస్, పెట్రోల్ బంకుల యాజమాన్యాల్లో భాగస్వామ్యం వంటి అనేక పథకాలకు మహిళలనే కేంద్రంగా పెడుతున్నట్లు వివరించారు.

స్థానిక ఎన్నికల్లో సముచిత నిర్ణయం కోరిన నాయకులు:

రాబోయే స్థానిక ఎన్నికల్లో మహిళలు ప్రతిఒక్కరు ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అనుకూలంగా మంచి నాయకుణ్ణి ఎన్నుకునే విధంగా ఉండాలని, ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి ఉమాశంకర్, మాజీ సర్పంచ్ లు వేణుగోపాల్ రెడ్డి, లింగమయ్యా, పెద్దలు మల్లయ్య, బాలస్వామి, లింగమయ్య, నాయకులు జంగయ్య, రాజమౌళి, గుద్దటి బాలరాజు, మహిళా సంఘం అధ్యక్షులు సునీత, అలివేల, ఎల్లమ్మ మరియు సాయిబాబు, సత్యనారాయణ సాయిబాబు, కాటమయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

TAGS: Indira Mahila Shakti Saree, Veltur Village News, Uppununthala Mandal, Revanth Reddy Women Schemes, Telangana Saree Distribution, Nagarkurnool Local News, Quality Indiramma Sarees, Veltoor Village, CM Revanth Reddy Praised, Indira Mahila Shakti Scheme, Sarees Distribution, Uppunuthala Mandal, Women Welfare, Telangana Government, Leader Remarks, Indiramma Sarees, Veltoor Village, CM Revanth Reddy, Indira Mah, Indira Mahila Shakti saree distribution, Veltur Telangana women empowerment, Telangana government saree program, CM Revanth Reddy initiatives, self-help group support, financial empowerment women Telangana, high-quality sarees distribution, women welfare schemes Telangana, Uppununthala village news, pro-women government programs, zero-interest loans for women, gas subsidy Telangana, women in petrol bunk management, local body elections Telangana, Telangana female empowerment programs

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com