మే 10న మోదీ సభను విజయవంతం చేద్దాం - మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

07, May 2026 Achampet 176 Views
Former Achampet MLA Dr. Guvvala Balaraju addressing a press conference regarding PM Modi's meeting.

మే 10న మోదీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం - మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు పిలుపు

అచ్చంపేట: ఈనెల 10వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు కోరారు. గురువారం అచ్చంపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అచ్చంపేట గడ్డ మీద నుండి మన గొంతులు బలంగా వినిపించాలని, నియోజకవర్గం నుండి కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ సభ వేదికగా గళం విప్పనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామ స్థాయి నుండి నాయకులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు అమర్ నాధ్, సోలంకి శ్రీనివాస్ నాయక్, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మరియు మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

TAGS: Achampet BJP news, Modi sabha Hyderabad, Achampet Guvvala Balaraju, Narendra Modi public meeting, Achampet BJP leaders, Parade Grounds meeting, BJP meeting May 10, Achampet latest political news, Guvvala Balaraju press meet, Telangana BJP news, Hyderabad Modi sabha, Achampet political updates, BJP karyakartalu Achampet, Achampet town news, Nagar Kurnool BJP news

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com