అమ్రాబాద్ ఎఫ్‌ఎస్‌ఓ శ్రీకాంత్‌పై డిఎఫ్‌ఓకు ఫిర్యాదు.. సిబ్బందిని బూతులు తిట్టారంటూ లేఖ

21, Apr 2026 Amrabad 176 Views
Written complaint letter by forest staff against FSO Srikanth for verbal abuse.

సిబ్బందిపై బూతు పురాణం.. అమ్రాబాద్ ఎఫ్‌ఎస్‌ఓ శ్రీకాంత్‌పై డీఎఫ్‌ఓకు ఫిర్యాదు!

అమ్రాబాద్: విధి నిర్వహణలో ఉన్న కింది స్థాయి సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించారనే ఆరోపణపై అమ్రాబాద్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) ఎస్. శ్రీకాంత్ వివాదంలో చిక్కుకున్నారు. తమను నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ, బెదిరింపులకు గురిచేశారని అటవీ శాఖ సిబ్బంది ఏ. విష్ణు మరియు పి. శ్రీనివాస్ జిల్లా అటవీ అధికారి (DFO) కి రాతపూర్వక ఫిర్యాదు చేశారు.

అసలేం జరిగిందంటే..: సిబ్బంది అందించిన ఫిర్యాదు లేఖ ప్రకారం.. ఈనెల 16వ తేదీ రాత్రి 7:11 గంటల ప్రాంతంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ATR) పరిధిలో ఒక ట్రాక్టర్ కలపతో వెళ్తోందని ఎఫ్‌ఎస్‌ఓ శ్రీకాంత్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. అయితే, కొద్దిసేపటికే అంటే 7:14 గంటలకు ఎఫ్‌ఎస్‌ఓ మళ్ళీ ఫోన్ చేసి, సమాధానం చెప్పేలోపే అత్యంత దారుణమైన బూతులు తిట్టడం ప్రారంభించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

అవమానకరంగా దూషణలు: "మీరు చెక్ పోస్ట్ వద్ద ఏం పీకుతున్నారు? బొక్కలో పడేస్తా.. నా బీపీ లేపకండి" అంటూ అసభ్య పదజాలంతో (బూతులు) దూషించారని లేఖలో పేర్కొన్నారు. రాత్రి 7:16 గంటలకు ట్రాక్టర్ రావడం, దానిని పట్టుకోవడం జరిగిందని.. పని చేస్తున్న తమను ఇలా కారణం లేకుండా బూతులు తిట్టడం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురయ్యామని సిబ్బంది వాపోయారు.

చర్యలు తీసుకోవాలని డిమాండ్: గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉండి, తోటి సిబ్బంది పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఎఫ్‌ఎస్‌ఓ శ్రీకాంత్‌పై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డీఎఫ్‌ఓను కోరారు. అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అధికారుల తీరుపై సిబ్బంది బహిరంగంగా ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

TAGS: Amrabad FSO Srikanth issue, Amrabad forest officer complaint, Nagarkurnool forest staff complaint, Amrabad Tiger Reserve news, ATR staff harassment issue, Telangana forest department news, Amrabad FSO abuse case, DFO complaint Nagarkurnool, forest staff problem Telangana, Amrabad forest controversy, Nagarkurnool latest forest news, Telangana government staff issue, ATR check post incident, forest officer behavior complaint, Amrabad news today
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com