CPM Protests in Balmoor Against LPG Gas Price Hike by BJP Govt

08, Mar 2026 Balmoor 176 Views
CPM Protests in Balmoor Against LPG Gas Price Hike by BJP Govt

గ్యాస్ ధరలు తగ్గేవరకు పోరాడుతాం.. బల్మూరులో సీపీఎం ఆధ్వర్యంలో రోడ్డుపై రాస్తారోకో

బల్మూరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేదలపై పెను భారం మోపడాన్ని నిరసిస్తూ బల్మూరు మండల కేంద్రంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నాయకులు నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పర్వతాలు, దేశా నాయక్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి రాకముందు 500 రూపాయలుగా ఉన్న సిలిండర్ ధర నేడు వెయ్యి రూపాయలు దాటిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ప్రజలు భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని వారు హెచ్చరించారు.

ఈ నిరసనలో మండల కార్యదర్శి శంకర్ నాయక్, నాయకులు ఎండి లాల్ మొహమ్మద్, గ్రామ కార్యదర్శి బాబర్, ఆంజనేయులు, శ్రావణ్ కుమార్, శేఖర్, రాములు, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

TAGS: CPM rasta roko protest Balmoor LPG price hike, Balmoor CPM protest cooking gas price increase, Achampet Balmoor LPG cylinder price protest news, CPM leaders demand reduction in gas prices Telangana, Balmoor mandal rasta roko CPM demonstration, LPG cylinder price hike protest Achampet constituency, CPM Parvathalu Desha Nayak protest Balmoor news, Telangana left party protest fuel price rise, Balmoor mandal CPM leaders demonstration update, cooking gas price hike protest Nagar Kurnool district, CPM agitation against BJP government LPG prices, Achampet Balmoor political protest latest news, Balmoor mandal road blockade CPM protest, LPG cylinder price above 1000 protest Telangana, Nagar Kurnool district CPM rasta roko agitation.
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com