గ్లోబల్ సమ్మిట్‌కు మోదీకి ఆహ్వానం: మెట్రో, RRR అనుమతులు కోరిన సీఎం రేవంత్ రెడ్డి

04, Dec 2025 Achampet 176 Views
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం...

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానిని కలిసిన సీఎం:

Aటవీ న్యూస్ న్యూఢిల్లీ:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న **"తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్"**లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పార్లమెంట్ భవన్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోదీ గారితో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రధానికి అందజేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా, తెలంగాణ దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించాలన్న సంకల్పంతో "తెలంగాణ రైజింగ్ 2047" దార్శనిక పత్రాన్ని (Vision Document) రూపొందించినట్టు వివరించారు.

2047 నాటికి తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని, అందుకు సమగ్రమైన ప్రణాళికలతో రోడ్ మ్యాప్‌ను రూపొందించినట్టు సీఎం తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్‌ను వివిధ రంగాల్లో నిష్ణాతులు, నిపుణులు, నీతి ఆయోగ్ సలహా సూచనలను క్రోడీకరించి మేధోమథనం అనంతరం రూపొందించినట్లు ప్రధానికి వివరించారు.

అభివృద్ధి పనులకు కేంద్రం సాయం కోరిన సీఎం: తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనలో, రాష్ట్ర అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రధాని మోదీ గారిని కోరారు. ముఖ్యంగా పలు కీలక ప్రాజెక్టుల అనుమతులు మరియు ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి చేశారు:

  1. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ: మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. దీని అంచనా వ్యయం రూ.43,848 వేల కోట్లు కాగా, దీనిని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టేందుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.
  2. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు (RRR): ఉత్తర భాగానికి కేబినేట్ ఆమోదంతో పాటు ఆర్థిక పరమైన అనుమతులు, అలాగే దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.
  3. రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు: రీజనల్ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదనల్లో ఉన్న రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును వీలైనంత త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
  4. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలు:
    • హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం.
    • హైదరాబాద్ నుంచి బెంగుళూరు హై స్పీడ్ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చోరవ చూపాలని కోరారు.
  5. శ్రీశైలం ఎలివేటేడ్ కారిడార్: హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు నాలుగు వరుసల ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.

ప్రధానమంత్రి మోదీ గారు ఈ అంశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

TAGS: CM Revanth Reddy PM Modi Meeting, Telangana Rising 2047, Hyderabad Metro Phase 2, Regional Ring Road Telangana, Srisailam Elevated Corridor, Bharat Future City Summit, CM Revanth Reddy PM Modi Meeting, Telangana Rising Global Summit, Hyderabad Metro Phase 2, Regional Ring Road RRR, Viksit Bharat 2047, Telangana 3 Trillion Dollar Economy, Srisailam Elevated Corridor, Greenfield Expressway Approval, Revanth Reddy meets PM Modi, Telangana Rising Global Summit 2024, Telangana Rising 2047 vision, Bharat Future City summit, Vision 2047 Telangana economy, $3 trillion economy Telangana, Viksit Bharat 2047 Telangana, Deputy CM Bhatti Vikramarka, New Delhi Telangana CM meeting, NITI Aayog collaboration Telangana, Telangana Global Summit December 8 9

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com