రాష్ట్ర తెలంగాణ నీట్ ఎగ్జామ్ లో బుడగ జంగాల కమ్యూనిటీ తరఫున విద్యార్థి తూర్పాటి రాజారాం నీట్ ల

22, Sep 2025 Achampet 176 Views
నీట్ లో ఎంబీబీఎస్ సీటు సాధించిన బుడగ జంగాల విద్యార్థికి ఘన సన్మానం...

అచ్చంపేట:

రాష్ట్ర తెలంగాణ నీట్ పరీక్షలో బుడగ జంగాల కమ్యూనిటీ తరఫున విద్యార్థి తూర్పాటి రాజారాం ఎంబీబీఎస్ (MBBS) సీటు సాధించి కమ్యూనిటీకే గర్వకారణంగా నిలిచారు. బుడగ జంగాల కమ్యూనిటీ నుండి ఎంబీబీఎస్ సీటు సాధించిన మొదటి విద్యార్థిగా రాజారాం రికార్డు సృష్టించారు.

ఈ సందర్భంగా అచ్చంపేట అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ తరఫున రాజారాంను ఘనంగా సన్మానించడం జరిగింది. రాజారాం తండ్రి రాంజీ సమక్షంలో యువజన సంఘం నాయకులు విద్యార్థిని అభినందించి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఉన్నత లక్ష్యాలకు రాజారాం ఆదర్శం

అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ... విద్యారంగంలో రాజారాం సాధించిన ఈ విజయం బుడగ జంగాల కమ్యూనిటీలోని ఇతర విద్యార్థులకు ఆదర్శమని పేర్కొన్నారు. సరైన ప్రోత్సాహం, పట్టుదల ఉంటే పేదరికంలో ఉన్నవారు కూడా అత్యున్నత లక్ష్యాలను సాధించవచ్చని రాజారాం నిరూపించారని వారు ప్రశంసించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో పాత్కూల శ్రీశైలం, పిల్లి హరిచంద్ర, బి. ఆనంద్, మొతే పెంటయ్య, కౌన్సిలర్ రాఘవులు, పాతుకుల శ్యాంసుందర్, హుస్సేన్, కొంకి విజయ్, మండరి పర్వతాలు, ప్రభాకర్ మండరి, అడ్వకేట్ ప్రశాంత్, ముత్యాలు, చిన్న ఆలూరయ్య తదితరులు పాల్గొన్నారు.

TAGS: Toorpati Rajaram NEET MBBS, Budaga Jangala Student Success, Achampet Ambedkar Yuva Sangham, Telangana NEET Results, First MBBS Student, Toorpati Rajaram MBBS, Budaga Jangala community achievement, Telangana NEET exam topper, Achampet Ambedkar Yuva Sangham felicitation, first Budaga Jangala MBBS student, Telangana medical entrance success, student achievement Telangana, Nagarkurnool district news, Telangana education news, Ambedkar Yuva Sangham recognition, MBBS seat Telangana, Telangana NEET results, student felicitation ceremony, Achampet community pride, Telangana youth achievements

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com