అమ్రాబాద్‌ నల్లమల అడవిలో ఎలుగుబంటి దాడి - యువకుడికి తీవ్ర గాయాలు

19, Mar 2026 Achampet 176 Views
Victim of bear attack being treated at Nagarkurnool Government Hospital

నల్లమలలో ఎలుగుబంటి దాడి.. మేకల కాపరిపై పంజా విసిరిన వన్యప్రాణి!

అమ్రాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి దాడి కలకలం సృష్టించింది. అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని మారెమ్మ వాగు సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పెట్రాలచేను గ్రామానికి చెందిన చిగుళ్లు ప్రశాంత్ అనే యువకుడు అటవీ ప్రాంతంలో మేకలు మేపుతుండగా, ఒక్కసారిగా పొదల్లోంచి వచ్చిన ఎలుగుబంటి అతనిపై దాడికి దిగింది.

ఈ దాడిలో ప్రశాంత్ ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి కాపరులు కేకలు వేయడంతో ఎలుగుబంటి అడవిలోకి పారిపోయింది. బాధితుడిని వెంటనే నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రశాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై అమ్రాబాద్ రేంజ్ ఆఫీసర్ వీరేశం స్పందిస్తూ.. నల్లమల అడవుల్లో వన్యప్రాణుల సంచారం పెరిగిందని, అడవికి వెళ్లేవారు, సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

TAGS: Nallamala forest bear attack, Amrabad forest range incident, shepherd injured bear attack Telangana, Nagarkurnool wildlife attack news, Chigulla Prashanth injured bear, Petralachenu village forest incident, Telangana forest department warning, wild animal attack Nallamala, Amrabad range officer alert, forest safety awareness Telangana

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com