BJP Calls for Balmoor Bandh Against Congress Attacks on Sitaram Reddy

27, Feb 2026 Balmoor 176 Views

బల్మూర్ బంద్‌కు బీజేపీ పిలుపు: ఉప సర్పంచ్ సీతారాం రెడ్డిపై కాంగ్రెస్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం

బల్మూర్: బల్మూర్ డిప్యూటీ సర్పంచ్, బీజేపీ నాయకుడు అనంత సీతారాం రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చేసిన భౌతిక దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. బాధితుడైన సీతారాం రెడ్డిపైనే అక్రమంగా మర్డర్ కేసు నమోదు చేసి జైలుకు పంపడం అన్యాయమని మండిపడింది. దీనికి నిరసనగా ఫిబ్రవరి 28, శనివారం బల్మూర్ బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది.

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్, జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు సీతారాం రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను కాజేయాలని చూస్తున్న కాంగ్రెస్ తీరును అడ్డుకున్నందుకే సీతారాం రెడ్డిని టార్గెట్ చేశారని ఆరోపించారు.

ఎమ్మెల్యే వంశీకృష్ణ దుందుభి నదిలో ఇసుక దందాలకు పాల్పడుతున్నారని, అచ్చంపేట అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. ఈ బంద్‌లో రైతులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని కాంగ్రెస్ అరాచకాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కూరకుల శిరీష మహేష్, జిల్లా నాయకులు పోల్ దాస్ రామ్, వరికుప్పల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

TAGS: Balmoor Bandh February 28 2026, BJP protest Balmoor, Anantha Sitaram Reddy arrest controversy, Deputy Sarpanch arrest Attempt to Murder case, BJP condemns illegal arrest, Congress vs BJP clash Balmoor, Achampet MLA Dr Chikkudu Vamsi Krishna allegations, Chikkudu Vamsi Krishna, BJP State Secretary Pothuganti Bharat Prasad, District President Vemula Narender Rao, Sitaram Reddy family visit BJP leaders, farmers land issue Achampet, sand mafia allegations Dindi River, Dundubhi River controversy Telangana, false cases withdrawal demand BJP, political tension Balmoor Mandal, law and order issue Telangana, Telangana political news today, Balmoor bandh news, Bharatiya Janata Party protest

 

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com