అచ్చంపేటలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం | బీసం ఆంజనేయులు

23, May 2026 Achampet 176 Views
Telangana Rajyadhikara Party (TRP) District President Beesam Anjaneyulu, along with constituency leaders, launching the party membership drive in Achampet.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) అధినేత తీన్మార్ మల్లన్న ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పార్టీ సభ్యత్వ నమోదు మరియు ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే ఇన్సూరెన్స్ (బీమా) కార్యక్రమం అచ్చంపేట నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. నాగర్‌కర్నూలు జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు బీసం ఆంజనేయులు ఆధ్వర్యంలో శనివారం నియోజకవర్గ వ్యాప్తంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బీసం ఆంజనేయులు మాట్లాడుతూ.. తీన్మార్ మల్లన్న ఆశయాల సాధనలో భాగంగా, సాధారణ ప్రజల కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడమే ధ్యేయంగా ఈ సభ్యత్వ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. టీఆర్పీ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కుటుంబానికి ప్రత్యేక బీమా వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే రూ. 2,50000 (రెండు లక్షల యాభై వేలు) వైద్యాన్ని, ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే సదరు కుటుంబానికి రూ. 5,00,000 (ఐదు లక్షల రూపాయలు) ప్రమాద బీమా అందుతుందని స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో అచ్చంపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తవిటి శైలజ, నాగర్‌కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు నరేష్, పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షులు నిరంజన్, ముఖ్య నాయకులు స్వామి, మహేశ్వరి మరియు పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TAGS: TRP Party Membership Drive, Teenmar Mallanna, Telangana Rajyadhikara Party, Achampet News, Nagarkurnool Politics, Insurance Scheme Telangana, TRP Membership Registration, Achampet Constituency, Bisam Anjaneyulu, Telangana Political News, Accident Insurance Scheme, Family Insurance Program, TRP Leaders, Telangana Breaking News, Political Membership Campaign, Poor Families Support, Telangana Regional Party, Teenmar Mallanna Party, Political Activities Telangana, Achampet Political Updates
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com