అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మానవత్వం; ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడికి ఆర్థిక సాయం!

22, Oct 2025 Achampet 176 Views

స్నేహమంటే నీదేరా.. అనారోగ్యంతో ఉన్న క్లాస్‌మేట్‌ను పరామర్శించి, అండగా నిలిచిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

హైదరాబాద్ / అచ్చంపేట: రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, కష్టాల్లో ఉన్న స్నేహితుడిని ఆదుకోవడంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు మానవత్వాన్ని చాటుకున్నారు. అచ్చంపేట వాస్తవ్యులు, ఎమ్మెల్యే గారి చిన్ననాటి స్నేహితుడు (క్లాస్ మెంట్) సయ్యద్ రియాజ్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఆస్పత్రిలో పరామర్శ - మెరుగైన చికిత్సకు ఆదేశం

ప్రస్తుతం రియాజ్ హైదరాబాద్ ECL లోని సన్ రైస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు బుధవారం నేరుగా ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న రియాజ్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం అక్కడి వైద్యులతో మాట్లాడి, రియాజ్‌కు ఎటువంటి లోటు లేకుండా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

ఆర్థిక సహాయం అందజేత

కేవలం పరామర్శించడమే కాకుండా, తన మిత్రుడి కుటుంబానికి భరోసా ఇస్తూ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. "నీకు ఏ అవసరం వచ్చినా నేనున్నానని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తావని" రియాజ్‌కు ధైర్యం చెప్పారు. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా, సాధారణ వ్యక్తిలా తన మిత్రుడి కోసం ఆస్పత్రికి వచ్చి సాయం చేయడంపై స్థానికులు మరియు అచ్చంపేట వాసులు ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

TAGS: Achampet MLA, Dr. Vamsi Krishna, MLA visit, victim support, Achampet news, political visit, Dr. Chikkudu Vamsi Krishna, MLA meets victim, local politician, MLA Chikkudu Vamshikrishna, Sunrise Hospital Hyderabad, Achampet MLA News, Friend Relief Aid, MLA Human Gesture, Dr Chikkudu Vamshikrishna, Achampet MLA, Sunrise Hospital Hyderabad, Syed Riaz, financial assistance, medical support, Telangana Congress MLA, Achampet news, Nagarkurnool district news, Hyderabad hospital news

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20265 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com