అచ్చంపేట మార్కెట్‌లో తడిసిన ధాన్యం: రైతులను దళారులు మోసం చేస్తున్నారు - పోకల మనోహర్

29, May 2026 Achampet 176 Views
BRS state leader Pokala Manohar inspecting rain-soaked paddy along with farmers at Achampet market yard.

అచ్చంపేట మార్కెట్‌లో దళారుల రాజ్యం.. రైతులపై అకాల వర్షం దెబ్బ!

అచ్చంపేట: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో దళారుల వ్యవస్థ విచ్చలవిడిగా మారిందని, వారు అమాయక రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోకల  తీవ్రంగా విమర్శించారు. గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డ్‌లో ఓపెన్‌గా ఉన్న ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం మార్కెట్ యార్డ్‌ను సందర్శించి, నష్టపోయిన రైతులను పరామర్శించారు. తదనంతరం మార్కెట్‌లోని ధాన్యాన్ని తక్షణమే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట మండల తహసిల్దార్ గారికి వినతిపత్రాన్ని అందజేశారు.

అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నయవంచన

ఈ సందర్భంగా పోకల మనోహర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

"అధికారంలోకి రాకముందు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, గిట్టుబాటు ధర కల్పిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. నేడు అధికార పీఠం ఎక్కాక రైతులను నడిసముద్రంలో ముంచేస్తున్నారు. మార్కెట్‌కు ధాన్యం వచ్చి 20 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడం అధికారుల, ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట." — పోకల మనోహర్, బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు

రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్లలో వారాల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరుణాన్ని ఆసరాగా చేసుకుని దళారులు సిండికేట్‌గా మారి రైతుల రక్తాన్ని తాగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం, మార్కెట్ అధికారులు నిద్రమత్తు వీడి సాధారణ ధాన్యంతో పాటు అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా ఎటువంటి నిబంధనలు పెట్టకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరగకపోతే బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉధృతమైన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అమినోదిన్, మున్సిపల్ మాజీ చైర్మన్ తులసిరాం, మండల పార్టీ అధ్యక్షులు పర్వతాలు, కౌన్సిలర్ రమేష్ రావు, నాయకులు బెల్లి బాలరాజు, పర్వతాలు, సుల్తాన్, రాజేష్, సోషల్ మీడియా ఇంచార్జ్ పిల్లి బాలరాజు మరియు పార్టీ శ్రేణులు, బాధిత రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TAGS: Achampet Market Yard, Rythu Problems Achampet, BRS Protest Achampet, Pokala Manohar News, Wet Dhanyam Issue, Achampet Farmers News, Dhanyam Konugolu Problem, Market Yard News Telangana, Congress Pai Fire, Achampet Latest News, Rythula Andolana, Telangana Farmers Issue, Dalari System Market Yard, Achampet Political News, Varsham To Tadisina Dhanyam, Farmers Loss News, Achampeta.com, BRS Leaders Achampet, Rythulaku Nyayam, Telangana News Today, Paddy Purchase Delay, Achampet Breaking News, Market Yard Visit, Farmer Support Program, Rythu Bandhu News, Telangana Local News, Achampet Town News, Dhanyam Purchase Demand, Rain Effect On Paddy, BRS Party Leaders
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com