KCR Birthday Celebrations in Achampet: BRS Leaders Mark the Occasion

17, Feb 2026 Achampet 176 Views

అచ్చంపేటలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు: కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు

అచ్చంపేట: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలను అచ్చంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోకల మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

నేతల ప్రసంగం: ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమని, రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. కేసీఆర్ పేరును చెరిపివేస్తామనే వారి మాటలు సాధ్యం కావని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి తెలంగాణకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అమీనుద్దీన్, మండల పార్టీ అధ్యక్షుడు పర్వతాలు ముదిరాజ్, సింగిల్ విండో చైర్మన్ మందా రాజిరెడ్డి, కౌన్సిలర్లు మను పటేల్, రమేష్ రావు మరియు సోషల్ మీడియా ఇంచార్జి పిల్లి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

TAGS: Achampet news, Achampet local news, KCR birthday celebrations Achampet, BRS party Achampet, Telangana politics Achampet, KCR birthday event, BRS leaders Achampet, political celebrations Achampet, Ambedkar statue Achampet, Telangana regional news, Achampet town updates, BRS activities Telangana, local political news Achampet, Achampet public events
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com