మూసేసిన 14 పాఠశాలలను తెరిపించాలి; అచ్చంపేట ఆర్డీవో ఆఫీస్ వద్ద సీపీఎం ధర్నా

21, Jul 2026 Achampet 176 Views
CPM Achampet Mandal Secretary Vardhan Saidulu submitting memorandum to DT Nazeer at RDO Office

సంక్షోభంలో విద్యారంగం.. మూసివేసిన 14 పాఠశాలలను వెంటనే తెరిపించాలి: సీపీఎం మండల కార్యదర్శి వర్ధం సైదులు

అచ్చంపేట:

తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, బడుగు, బలహీన వర్గాలు మరియు గిరిజన, ఆదివాసీ విద్యార్థులకు విద్య అందని ద్రాక్షలా మారిందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) అచ్చంపేట మండల కార్యదర్శి వర్ధం సైదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యారంగంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో అచ్చంపేట ఆర్డీవో (RDO) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం డిప్యూటీ తహశీల్దార్ (DT) నజీర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వర్ధం సైదులు మాట్లాడుతూ.. అచ్చంపేట మండలంలో నక్కెర్లపెంట, దర్శన్‌గడ్డ, వంకమూతి తండా, పెద్దవాగు తండా, కుర్ర తండా, కేశవ తండా, దుబ్బ తండా, మార్లబాండ్ తండా తదితర గిరిజన తండాల్లోని మొత్తం 14 పాఠశాలలను పూర్తిస్థాయిలో మూసివేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని చెబుతూనే, మరోపక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విద్యను దూరం చేసేలా బడులను మూసివేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను తక్షణమే రద్దు చేసి, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దెబ్బతిన్న పాఠశాల భవనాలకు మరమ్మతులు చేపట్టి మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడకపోతే సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం టౌన్ సెక్రటరీ రాములు, నాయకులు చరణ్, లక్ష్మణ్, ఇస్సాక్, మల్లేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Achampet News, CPM Achampet, Vardham Saidulu, Government Schools Telangana, Closed Schools Achampet, Telangana Education News, Tribal Schools, Government Education, Teacher Vacancies, School Reopening, Nagarkurnool News, CPM Protest, Public Education Telangana, Achampeta News, RDO Office Protest
Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్
Health

నాగర్‌కర్నూల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కమిటీ రద్దు: కన్వీనర్ శివకుమార్

01, Aug 20265 Views
అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
Health

అస్సాం వరదలు: 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం

01, Aug 20265 Views
శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు
Health

శ్రీశైలం డ్యాంలోకి భారీగా వరద ప్రవాహం: ప్రస్తుత నీటి మట్టం వివరాలు

01, Aug 20265 Views
వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు
Health

వంగూర్ మండల పరిషత్ సమావేశం: అధికారులకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాలు

01, Aug 20265 Views
ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ
Health

ఫీజుల బకాయి – బిజేపి లడాయి: అచ్చంపేటలో బిజేవైఎమ్ భారీ సంతకాల సేకరణ

31, Jul 20264 Views
పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి
Health

పబ్బతి ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపు: ₹59.38 లక్షల ఆదాయం, 2.6 కేజీల వెండి

29, Jul 20265 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com