మహిళల కోసం కేంద్రం మరో స్కీమ్.. తక్షణమే రూ.10 లక్షల రుణం.
కేంద్రం ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. అందులోనూ మహిళలు సొంతంగా వ్యాపారం చేస్తూ.. సాధికారత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందిస్తోంది. ఇప్పటికే మహిళల కోసం ఎన్నో రకాల పథకాలను ప్రకటించిన కేంద్రం
కేంద్రం ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. అందులోనూ మహిళలు సొంతంగా వ్యాపారం చేస్తూ.. సాధికారత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందిస్తోంది. ఇప్పటికే మహిళల కోసం ఎన్నో రకాల పథకాలను ప్రకటించిన కేంద్రం.. వారి కోసం మరో స్కీమ్‌ని ప్రేవేశ పెట్టింది. ఈ డబ్బుతో మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. ‘మహిళా ఉద్యమ్ నిధి’ పేరుతో చిన్న తరహా పరిశ్రమలను నిర్వహించే మహిళలకు రూ.10 లక్షల వరకూ ఆర్థిక సహకారం అందించనుంది కేంద్రం. ఉమెన్ ఎంట్రప్రెన్యూర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. mahila udyam nidhi scheme
ఈ డబ్బుతో మహిళలు పలు రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు. అలాగే తీసుకున్న రుణాన్ని 10 ఏళ్ల లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా మహిళలకు ప్రత్యేకంగా ఫిక్స్‌డ్ వడ్డీ రేట్ ఉంటుంది. అయితే ఈ వ్యాపారంలో మహిళల భాగస్వామ్యం 51 శాతం కన్నా ఎక్కువగా ఉండాలి. వ్యాపారాన్ని విస్తరించేందుకు, ఉత్పత్తి పెంచేందుకు, సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఈ లోన్ తీసుకోవచ్చు.
mahila udyam nidhi scheme
దీంతో మహిళలు బ్యూటీ పార్లల్, పలు రకాల సర్వీస్ సెంటర్స్, క్యాంటీన్, రెస్టారెంట్స్, సైబర్ కేఫ్, టెలీఫోన్ బూత్, జిరాక్స్ సెంటర్స్, టీవీ రిపేరింగ్, సెలూన్స్, టైలరింగ్, కంప్యూటరైజ్డ్ డెస్క్ టాప్, బట్టల షాపులు లాంటి వ్యాపారాలకు ఈ లోన్ తీసుకోవచ్చు. ఈ రుణాలకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మొదట పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ స్కీమ్‌ని ప్రారంభించింది. కానీ ఇప్పుడు దాదాపు అన్ని బ్యాంకుల్లో ఈ లోన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే సంబంధిత బ్యాంకుల వద్దకు వెళ్లి మీ వ్యాపారానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. ఇందులో మహిళలకు కూడా ప్రయోజనం కలిగించే స్కీమ్స్ ఉన్నాయి. మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అందిస్తోంది. దీని పేరు మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) ఈ పథకాన్ని అందిస్తోంది.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin