తెలంగాణ ఇంటర్ పరీక్ష- 2021మోడల్ సిలబస్, ప్రశ్నల సరళి ఇదీ..
తెలంగాణ ఇంటర్ పరీక్ష- 2021మోడల్ సిలబస్, ప్రశ్నల సరళి ఇదీ..
తెలంగాణ రాష్ట్రంలో మే 1 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పరిగణనలోకి తీసుకునే మోడల్ సిలబస్, ప్రశ్నల సరళిని ఇంటర్మీడియట్ బోర్డు తమ వెబ్‌సైట్‌లో (https://tsbie.cgg.gov.in/ home.do) ఉంచింది.
ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధిం చిన 285 పేజీల మోడల్ ప్రశ్నపత్రాలున్నాయి. ఉదాహ రణకు 60 చొప్పున మార్కులు కలిగిన బోట నీ, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులు పరిశీలిస్తే.. గతంలో 2 ప్రశ్నలు ఇచ్చి ఒకటి రాయమ నడం, 3 ప్రశ్నలు ఇచ్చి 2 రాయమనడం వంటి విధా నముండేది. కానీ ఇప్పుడు వాటి స్వరూపం మార్చేసింది.
- ఒక్కో ప్రశ్నపత్రంలో మూడు సెక్షన్లుగా 26 ప్రశ్నలు ఇవ్వనుంది.
- సెక్షన్ -ఎలో ఒక్కోదానికి 2 మార్కులు కల 10 ప్రశ్నలుంటాయి. వీటన్నింటికీ సమాధానం రాయాలి.
- సెక్షన్-బిలో 4 మార్కుల ప్రశ్నలు 12 ఉంటే ఆరింటికి జవాబు రాయాలి.
- అలాగే సెక్షన్ -సి లో 8 మార్కుల ప్రశ్నలు 4 ఉంటే రెండింటికి సమాధానం రాయాలి.
ఇక 100 మార్కులు కలిగిన హ్యుమానిటీస్ సబ్జెక్టుల్లో… ఉదాహరణకు కామర్స్‌ను తీసుకుంటే..
- పార్ట్-1 సెక్షన్ -ఎలో 10 మార్కుల ప్రశ్నలు 4 ఇస్తారు. వీటి లో రెండింటికి జవాబులు రాయాలి. సెక్షన్ – బిలో 5 మార్కుల ప్రశ్నలు 8 ఇస్తారు. వీటిలో నాలుగింటికి సమాధానం రాయాలి. సెక్షన్ -సి లో 2 మార్కుల ప్రశ్నలు 10 ఇస్తే ఐదింటికి జవాబులు రాయాలి.
- పార్ట్-2 సెక్షన్ -డిలో 20 మార్కుల ప్రశ్న ఒకటి ఇస్తారు. దానికి సమా ధానం రాయాలి. సెక్షన్ -ఈలో 10 మార్కుల ప్రశ్నలు 3 ఉంటే ఒకదానికి జవాబు రాయాలి. సెక్షన్-ఎఫ్‌లో 5 మార్కుల ప్రశ్నలు 6 ఇస్తారు. వీటిలో రెండింటికి జవాబులు రాయాలి. సెక్షన్-జిలో 2 మార్కుల ప్రశ్నలు 10 ఇస్తే 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఇలా అన్ని సబ్జెక్టుల్లోనూ చాయిస్ సంఖ్య పెంచారు. ఇది ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin