మే 3 వరకూ రెండో విడత లాక్‌డౌన్… 7 సూత్రాలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 10వేలు దాటిన సమయంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ లాక్‌డౌన్ పొడిగింపుపై కీలక ప్రసంగం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ ఇవాళ్టితో ముగియడంతో… నెక్ట్స్ ఏంటి అనే అంశంపై ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 10వేలు దాటడం, అలాగే… మృతుల సంఖ్య 300 దాటిన సమయంలో… ప్రధానమంత్రి ప్రసంగం అత్యంత కీలకంగా మారింది. India lock down until May 3
మరో 19 రోజులపాటూ…. లాక్‌డౌన్ కొనసాగాల్సిన అవసరం ఉండాలన్నారు ప్రధాని మోదీ. మే 3 వరకూ లాక్‌డౌన్ కొనసాగించాలని చెప్పారు. దేశంలో ఎవరు కరోనాతో చనిపోయినా అందరికీ బాధేనన్నమోదీ… హాట్ స్పాట్‌లు కీలకం అన్నారు. కరోనా కట్టడికి బలమైన అడుగులు పడాలన్నారు. ఇకపై కూడా లాక్‌డౌన్ ఆంక్షలు కఠినంగానే ఉంటాయన్న మోదీ… హాట్‌స్పాట్‌లపై ఎక్కువ దృష్టి పెడతామన్నారు. పరిస్థితిని సమీక్షించి… ఆంక్షల తొలగింపుపై ఆలోచిస్తామన్నారు. లాక్‌డౌన్ నిబంధనలపై రేపు మార్గదర్శకాలు జారీ కానున్నాయి. India extends corona virus lock down until May 3
7 కీలక విషయాల్లో ప్రజలతో మోదీ ఉంటానన్నారు.
- 1. ఇళ్లలో వ్యాధులతో బాధపడేవారికి అండగా ఉండాలన్నారు.
- 2.లాక్‌డౌన్, సోషల్ డిస్టాన్స్ తప్పక పాటించాలన్నారు. ఇళ్లలో ఉంటూ… మాస్క్ ధరించాలన్నారు.
- 3.వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ చెప్పిన సూచనలు పాటించాలన్నారు.
- 4.కరోనా రాకుండా ఆరోగ్య సేతు మొబైల్ యాప్ వాడాలన్నారు. ఇన్‌స్టాల్, డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.
- 5. పేదవారికి భోజనం వంటివి పెట్టమన్నారు.
- 6.ప్రతి ఒక్కరూ తమ తమ పనులు చేసుకోవాలన్నారు.
- 7.డాక్టర్లు, పోలీసులు, కరోనాపై పోరాడే అందర్నీ గౌరవించాలన్నారు.
ఈ ఏడు విషయాల్లో ప్రజలతో ఉంటానన్న మోదీ… ఇవి ఏడూ విజయాన్ని ఇస్తాయన్నారు. వీటిని అందరం తప్పనిసరిగా పాటించాలన్నారు.
India lock down until May 3
అంబేద్కర్ జయంతి రోజున… దేశ ప్రజలందరం ఒకే సంకల్పంతో అంబేద్కర్‌కి నిజమైన శ్రద్ధాంజలి ప్రకటిస్తున్నామన్నారు మోదీ. దేశంలో వేర్వేరు రాష్ట్రాల్లో రకరకాల పండుగలు జరుగుతున్నాయన్న ప్రధాని మోదీ… ప్రజలంతా ఎంత నిబద్దతతో ఇళ్లలోనే ఉంటూ పండుగలు సాధారణంగా జరుపుకుంటున్నారని మెచ్చుకున్నారు. అది ఎంతో ప్రశంసనీయం అన్నారు. ఈ విషయంపై దేశ ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. దేశంలో కరోనా కేసు లేనప్పటి నుంచే… విదేశాల్లో కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారిని ఎయిర్‌పోర్టుల్లో పరీక్షించామని ప్రధాని తెలిపారు. విదేశీయులకు 14 రోజుల క్వారంటైన్ తప్పని చేశామన్నారు. దేశంలో 500 కరోనా కేసులు ఉన్నప్పుడే… 21 రోజుల లాక్‌డౌన్ అమలు చేశామన్నారు.
ఈ పరిస్థితుల్లో ఏ దేశాన్నీ విమర్శించడం కరెక్టు కాదన్న మోదీ… కానీ ప్రపంచంలో కొన్ని సంపన్న దేశాలు కరోనాను ఆపలేకపోతున్నాయన్నారు. వాటితో పోల్చితే భారత్ ఎంతో సమర్థంగా కరోనాను ఆపుతోందని అన్నారు మోదీ. ఒకప్పుడు భారత్‌తో సమానంగా కేసులు ఉండే దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు బాగా పెరిగి మృతుల సంఖ్య బాగా ఎక్కువగా ఉందన్నారు. సమయానుకూలంగా స్పందించకపోయి ఉంటే… ఇప్పుడు భారత్ పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉండేదన్నారు మోదీ. మనం సరైన దారిలోనే వెళ్తున్నామని అన్నారు. సోషల్ డిస్టెన్సింగ్, లాక్‌డౌన్ వల్ల దేశానికి ఎంతో మేలు జరిగిందన్నారు. ఆర్థిక పరంగా చూస్తే… కష్టమే అయినప్పటికీ… భారత్ ఏ మార్గంలో వెళ్తుందో… దానిపై ప్రపంచం అంతా మాట్లాడుకుంటోందని ప్రధాని అన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin