శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దర్శనము చేసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల అమల బాలరాజు గారి దంపతులు
శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దర్శనము చేసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల అమల బాలరాజు గారి దంపతులు
హనుమాన్ జయంతి సందర్భంగా నేడు
పదర మండల కేంద్రంలోని శ్రీ పబ్బతి Hanuman ఆంజనేయ స్వామి దర్శనము చేసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల అమల బాలరాజు గారి దంపతులు, ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అనంతరం 101 కలశాలతో స్వామి వారికి పూజ కార్యక్రమం,అనంతరం మహా చండీయాగం కార్యక్రమం నిర్వహించడం జరిగింది…కార్యక్రమంలో మండల ఎంపీపీ బిక్య నాయక్, వైస్ ఎంపీపీ వరుణ్ కుమార్,జడ్పీటీసీ రాంబాబు, కేన్సిలర్ విష్ణుమూర్తి, రైతు సమితి అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ శంకర్, రమేష్, మండల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు వెంకటయ్య, గోలి శ్రీను,యూత్ నాయకులు డ్యాగ అనిల్ కుమార్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు… Hanuman Jayanti Padara Mandal
హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. ఈశ్వరుని అంశ, వాయుదేవుని ఔరస పుత్రుడైన హనుమ మహాబలుడు. అర్జునునికి ప్రియ సఖుడు.. శ్రీరామ దాసుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మ శోకాన్ని హరించినవాడు. ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొచ్చి యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణనుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు ప్రయాణం, నిద్రపోయే ముందు స్మరించినవారికి మృత్యుభయం ఉండదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.
Hanuman Jayanti Padara Mandal
ధైర్యం, శక్తి సామర్ధ్యాలకు హనుమత్ రూపం ప్రతీకం. ఆకాశ మార్గాన ప్రయాణించి సముద్రం దాటి లంకలోకి ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టారు. సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తి యుక్తులను కీర్తించడం ఎవరి తరం కాదు. హనుమాన్ జయంతిని కొందరు చైత్ర పౌర్ణమి నాడు, మరికొందరు వైశాఖ దశమి నాడు జరుపుతారు. కేరళలో మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube
| Linkedin