గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26000 ఇవ్వాలి

గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26000 ఇవ్వాలి
ఆర్ శ్రీనివాసులు సిఐటియు జిల్లా కార్యదర్శి
బల్మూరు: గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాలలో వెట్టిచాకిరి చేస్తున్నారని తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బల్మూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ మండల కమిటీ సమావేశము మండల అధ్యక్షులు నిరంజన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆర్ శ్రీనివాసులు హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాలలో వెట్టిచాకిరి చేస్తున్నారని గత ప్రభుత్వము పారితోషికాలు ఇస్తూ నటి చేయించుకుంటే కనీస వేతనం అమలు చేయాలని అనేక పోరాటాలు చేసిన ఫలితం లేకపోవడంతో గ్రామపంచాయతీ వర్కర్లు అందరు కూడా కలిసికట్టుగా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారని ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దానికోసం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే చట్టాన్ని పాస్ చేసి కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు శంకర్ నాయక్ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తుల వెంకటేష్ మండల నాయకులు ఈశ్వరయ్య, బాలస్వామి చిన్నయ్య తదితరులు ఉన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin