తెలంగాణలో కరోనా టెర్రర్.. పదివేలు దాటిన పాజిటివ్ కేసులు..
తెలంగాణలో కరోనా టెర్రర్.. పదివేలు దాటిన పాజిటివ్ కేసులు..
కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తెలంగాణాలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ
covid cases in telangana కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తెలంగాణాలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 891 మందికి పాజిటివ్ వచ్చింది. ఐదుగురు మృతిచెందారు. తాజాగా తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇవాళ జిహెచ్ఎంసి పరిధిలో719, రంగారెడ్డి 86, మేడ్చల్ 55, సంగారెడ్డి 2, కామారెడ్డి 1, కరీంనగర్ 2, ఖమ్మం 4, భద్రాద్రి 6, సిద్దిపేట 1, మహబూబాద్ 1, నల్గొండ 2, గద్వాల1, వరంగల్ రూరల్ 3, వరంగల్అర్బన్ 3, నిజామాబాద్ 1, ఆదిలాబాద్ 1 కేసుల చొప్పున నమోదయ్యాయి.
covid cases in telangana
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారితో పోరాడుతూ 4361 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 225 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 5858 యాక్టివ్ కేసులున్నాయి.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin