ఇంటింటి సర్వే చేపట్టండి.. తెలంగాణకు కేంద్రం సూచన
కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఇంటింటి
సర్వే చేపట్టాలని తెలంగాణ సహా పది రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అసరమైతే వెంటనే కరోనా టెస్టులు చేయాలని ఆదేశించింది.
దేశంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్న వేళ కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో.. జనసాంద్రత ఎక్కవగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించింది. అవసరమైన వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని.. బాధితులను విడిగా ఉంచాలని సూచించింది. తెలంగాణ సహా మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, హర్యానా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారులతో కేంద్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. corona house to house survey
corona house to house survey
ఇంటింటి సర్వే నిర్వహించి సకాలంలో రోగులను గుర్తించాలని.. టెస్టుల ఫలితాలు సకాలంలో వచ్చేలా చూడాలని.. రోగులకు మంచి వైద్య సేవలు అందించాలని.. మరణాలను సాధ్యమైనంత వరకు తగ్గించాలని ఈ సమావేశంలో సూచించారు. అంబులెన్స్ సేవలను సమర్థవంతంగా ఉపయోగించాలని.. సర్వే టీంలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేయాలని సూచించారు.
కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని.. బఫర్ జోన్లలోని తీవ్ర శ్వాసకోశ సమస్యలు, ఫ్లూ తరహా అనారోగ్య సమస్యలున్న రోగులను గుర్తించాలన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో జిల్లాల వారీగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
కరోనా అలర్ట్ః కేంద్రాన్ని హెచ్చరించిన 15వ ఆర్థిక సంఘం
కరోనా బాధితుల్లో మరణించే వారి సంఖ్యను 5 శాతం లోపే ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి 15వ ఆర్థిక సంఘం సూచించింది. మరణాలు 5శాతం దాటితే దాని ప్రభావం ఆర్థిక రంగంపై తీవ్రంగా పడుతుందని హెచ్చరించింది. ప్రస్తుతం దేశంలో కరోనా మరనాల రేటు 2.8 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం సూచించిన పూర్తి వివరాలు పరిశీలించగా..
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin