దాల్చిన చెక్క పొడిని టీలో కలుపుకొని తాగొచ్చా? ప్రయోజనాలేమిటీ?
దాల్చిన చెక్కను పక్కన పెట్టేస్తున్నారా? దాన్ని కేవలం సాధారణ వంటలకే పరిమితం చేయకుండా. ఇదిగో ఇలా టీ లేదా ఇతరాత్ర పానీయాల్లో కలుపుకుని తాగేయండి.
దాల్చిన చెక్క.. సువాసనతోపాటు మంచి రుచిని కూడా అందించే ఈ చెక్కను చాలామంది పచ్చిగా కూడా తినేస్తుంటారు. తీయగా, ఘాటుగా ఉండే దీన్ని వంటల్లో వాడతారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా బిర్యానీ, పలావు లాంటి వంటకాల్లో ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే, దాల్చిన చెక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో చూద్దామా! benefits of cinnamon powder
ఉదయాన్నే టీలో కలుపుకుని తాగితే?: రోజూ ఉదయాన్నే టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని ఆహార నిపుణులు తెలిపారు. దాల్చిన చెక్కలో శరీరానికి కావాల్సిన పీచు, కాల్షియం, ఐరన్ తదితర పోషకాలు ఉంటాయి. అందుకే చాలా చాలా దేశాల్లో దీన్ని మిరాకిల్ ఫుడ్ అని అంటారు.
దాల్చిన చెక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
❂ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం వల్ల ఒంట్లో షుగర్ స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
❂ దాల్చిన చెక్క ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది.
❂ పేగుల్లో ఏమైనా సమస్య ఉంటే దాల్చిన చెక్క తొలగిస్తుంది.
❂ దాల్చిన చెక్క రక్తం గడ్డ కట్టడాన్ని అరికడుతుంది.
❂ శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి దాల్చిన చెక్క తోడ్పడుతుంది.
❂ దాల్చిన చెక్క గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.
❂ కీళ్ల నొప్పులు తగ్గించడంలోనూ దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుంది.
❂ శరీరంలోని నిస్సత్తువను దూరం చేసి రోజంతా సరిపడే శక్తిని ఇస్తుంది.
❂ కణాలు నష్టపోకుండా కాపాడుతుంది.
❂ క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది.
ఎలా తీసుకోవాలి?: దాల్చిన చెక్కను తేనెలో కలుపుకొని తినడం వల్ల ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వు తొలగిపోతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె సంబంధ రోగాలను అరికడుతుంది. దాల్చిన చెక్క పొడి ఉదయాన్నే తాగే కాఫీ లేదా టీలో దీన్ని కలుపుకొని తాగాలి. పళ్ల రసాల్లోనూ ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగవచ్చు. benefits of cinnamon powder
ఈ సమస్యలు ఉంటే వద్దు: దాల్చిన చెక్క పొడిని అన్ని వయసుల వారు తినొచ్చు. అయితే, చర్మం మంటగా ఉన్నా, అలర్జీలు ఏర్పడినా.. తీసుకోవడం మానేయండి. గర్భిణీలు, ఆరేళ్ల లోపు పిల్లలు దాల్చిన చెక్కను ఆహారంతో తీసుకోకపోవడం మంచిది. పేగు సమస్యలు, కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారు దాల్చిన చెక్కను తీసుకోవద్దు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin