సింగిల్ విండో ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి

సింగిల్ విండో ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి…..
బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి…
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు సింగిల్ విండో ఎన్నికల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ కార్యాలయంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి శుక్రవారం రోజున ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సింగిల్ విండో ఎన్నికల్లో డైరెక్టర్లకు రిజర్వేషన్లు కల్పించిన గత ప్రభుత్వాలు సొసైటీ అధ్యక్షులకు డీసీసీబీ చైర్మన్ లకు మాత్రం రిజర్వేషన్లు కల్పించలేదని ఆయన తెలిపారు. త్వరలో జరిగే సింగిల్ విండో ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడానికి స్వాగతిస్తూ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల బీసీలు రాజకీయంగా అభివృద్ధి సాధిస్తారని గతంలో ఏ సీఎం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి అన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin