పోల్ దాస్ రాముకు నాగర్ కర్నూల్ బిజెపి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలి

బీసీ సామాజిక వర్గానికి చెందిన పోల్ దాస్ రాముకు నాగర్ కర్నూల్ బిజెపి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలి.
బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి.
నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినపల్లి మండలంలో బీసీ చైతన్య కమిటీ మండల నాయకులు మరియు బీసీ కుల సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి పార్టీలో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందిన గగ్గలపల్లి పోల్దాసు రాముకు బిజెపి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని నాగర్ కర్నూల్ నియోజకవర్గం బిజినపల్లి మండలం నుండి బీసీ చైతన్య కమిటీ నాయకులు మరియు కుల సంఘం నాయకులు బిసి పొలిటికల్ జెఎసి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ద న్నోజు అరవింద్ చారి పోల్ దాస్ రాముకు అధ్యక్ష పదవి ఇచ్చేంతవరకు జిల్లావ్యాప్తంగా పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. achampet
బిజెపి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష పదవిని ఇంతకుముందు అగ్రవర్ణాల వర్గాలు చేశాయని అన్నారు.పార్టీని నమ్ముకొని ఉండి గత 25 సంవత్సరాలుగా పార్టీ జెండాను మోస్తూ అందర్నీ సమన్వయ పరుస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలలోకి తీసుకు వెళ్లడం మరియు కమిటీలు వేసి పార్టీ బలోపేతానికి, పార్టీ సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి పోల్దాసు రాము అని కొనియాడారు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గం నుండి బిజెపి పార్టీలో అతను జిల్లా అధ్యక్షులుగా పోటీలో ఉన్నాడు కాబట్టి బిజెపి రాష్ట్ర కమిటీ అతనికి సహకరించి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వవలసిందిగా బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి కోరారు. ఈ సమావేశంలో బీసీ చైతన్య కమిటీ మండల నాయకులు తుమ్మల అల్లోజి, వేముల సత్యశీల సాగర్, కల్మూరి చిన్నయ్య సాగర్, గుంటి కురుమూర్తి, గుంట నరసింహ బిజెపి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin