ఉపాధ్యాయురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.
నల్గొండ జిల్లా దేవరకొండలో ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎంఈవో కార్యాలయం వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దేవరకొండ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ… కన్నీటి పర్యంతమయ్యారు.