30 రోజుల గ్రామ ప్రణాళిక ముగింపు సభ
ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళికా కొన్ని గ్రామాల్లో ముగ్గింపు దశకు చేరుకుంది.
ఉప్పునుంతల మండలంలోని కొరటికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన 30 రోజుల గ్రామ ప్రణాళిక ముగింపు గ్రామసభ సర్పంచ్ జి.రమేష్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, పనులను గ్రామస్తులకు వివరించి, వివిధ అంశాల వివరంగా చర్చించి ముగించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణయ్య,ఎంపీటీసీ సభ్యులు అనురాధ,గ్రామ కార్యదర్శి లలిత,ప్రత్యేక అధికారి ఖాజా,ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్,గ్రామ నాయకులు వెంకట్ రెడ్డి,గణేష్,ప్రణాళికా కమిటీ సభ్యులు,వార్డు నంబర్లు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.