13న పదో తరగతి ఫలితాలు విడుదల.

తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 13వ తేదీన విడుదల కానున‍్నాయి. సోమవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ అధికారులు ఫలితాలు విడుదల చేస్తారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 3వ తేదీవరకూ జరిగాయి. కాగా ఇంటర్ ఫలితాల వెల్లడిలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఫలితాల విడుదలలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.