హాస్టల్ వర్కర్స్ సమస్యల్ని పరిష్కరించాలి
ఆశ్రమ పాఠశాలల,హాస్టల్ దినసరి అవుట్ సోర్సింగ్ వర్కర్ల పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు సురేందర్ డిమాండ్ చేశాడు.అచ్చంపేట పట్టణంలో సీఐటీయూ కార్యాలయంలో సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశంను ఉద్దేశించి వారు మాట్లాడుతూ…వర్కర్లకు ఎనిమిది నెలల వేతనాలు చెల్లించాలని,సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సులు,సెప్టెంబర్ 30న కమిషనర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోపాల్,కోశాధికారి భరత్,సభ్యులు మల్లయ్య, భారతి,సీఐటీయూ జిల్లా నాయకులు శంకర్ నాయక్ పాల్గొన్నారు.