హజ్ యాత్రికులకు ఘనంగా సన్మానం
ముస్లింల పవిత్రతకు చిహ్నమైన హజ్ యాత్రకు బయలుదేరుతున్న యాత్రికులకు మంగళవారం లింగాల మండల కేంద్రంలో ఘనంగా సన్మానించారు.మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ రఫీఉల్లా ఆసాది హజ్ యాత్రకు వెళుతున్న సందర్భంగా స్థానిక జామియా మస్జిద్ లో వారిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…ప్రతి ముస్లిం సహోదరులు జీవితంలో ఒక్కసారైన హజ్ సందర్శనకు వెళ్ళి జీవితాన్ని పవిత్రం చేసుకోవాలన్నారు.హజ్ యాత్రకు వెళుతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ ప్రెసిడెంట్ ఇస్మాయిల్ వాయిస్, ప్రెసిడెంట్ ఆరీఫ్ జిలాని నసీర్, నిజం సర్దార్ సిరాజ్ ఖాన్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.