స్థానిక బాలుర ఉన్నత పాఠశాల నందు పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
అచ్చంపేట పట్టణంలోని స్థానిక బాలుర ఉన్నత పాఠశాల నందు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు జిల్లా పోలీసు కళాజాత బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులకు వారు చదువుతూ ఉన్న క్రమంలో చెడు వ్యసనాలకు గురికావద్దని, అదేవిధంగా 14 సంవత్సరాలలోపు బాలబాలికలను బాల కార్మికులుగా పెట్టుకోవద్దని, బాల కార్మికులుగా పెట్టుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని తెలియజేశారు.
18 సంవత్సరాలలోపు బాలురు మోటార్ సైకిల్ గాని,4 వీలర్స్ నడప రాదని తెలియజేశారు. వారు నడిపినట్లయితే వాహన యజమానుల పై కేసు నమోదు చేయబడుతుందని తెలియజేశారు.అదేవిధంగా బాలికలు బాల్యవివాహాలు చేసుకోరాదు, బాల్యవివాహాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల,బాలికలు తప్పనిసరిగా ఈత నేర్చుకోవాలని విద్యార్ధులకు సూచించారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎస్ఐ అంజయ్య, పోలీస్ కళాజాత బృందం సభ్యులు పాండు,రవి, శ్రీను, బాలకృష్ణ,సంధ్య పాల్గొన్నారు.