సేవ్ నల్లమల గణపతులు

0
Share

నల్లమల ప్రాంతంలో యురేనియం నిక్షేపాల వెలికితీతకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరుతూ అచ్చంపేటలోని యువజన సంఘాలు సేవ్ నల్లమల అనే నినాదంతో మండపాలను ఆకర్షణీయంగా తీర్చిదిదారు.
మారుతీనగర్ లోని గాంధీ యూత్, జూబ్లీనగర్ లోని జూనియర్స్ అధ్వర్యంలో సేవ్ ఫారెస్ట్,సేవ్ నల్లమల అని మండపాలను తయారుచేశారు.

రాంరహీమ్ యువజన సంఘము అధ్వర్యంలో మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి ఏటాలాగే ఈ సంవత్సరం కూడా వినాయకుడిని ప్రతిష్టించారు.నాలుగేళ్లుగా ప్రత్యేకంగా మట్టి గణపతిని నెలకొల్పి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.కౌన్సిలర్లు డాక్టర్ విష్ణుమూర్తి,శైలజ రెడ్డి ఆధ్వర్యంలో.

పర్యావరణ పరిరక్షణను చాటుతూ గణపతి:
టంగాపూర్ లోని చెన్నకేశవ సంఘము గణేష్ ఉత్సవ కమిటీ పర్యావరణ పరిరక్షణను చాటుతూ గణపతిని ప్రతిష్టించారు.
అడవితోనే మానవ మనుగడ అని చాటిచెబుతూ…
*పర్యావరణ రక్షణ సర్వజన రక్షణ

*వృక్షోరక్షతి రక్షితః
*చెట్లు నాటే చేతులు తరతరాలకు ఆరని జ్యోతులు అంటూ ప్రజలకు చాటి చెప్పే ప్రయత్నం చేశారు.

మత సామరస్యానికి ప్రతీకగా రాంరహీమ్ యువజన సంఘము అధ్వర్యంలో గణనాధుని ప్రతిష్టించారు.గత నాలుగేళ్లుగా మట్టి గణపతిని నెలకొల్పి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కౌన్సిలర్లు డాక్టర్ విష్ణుమూర్తి,శైలజ రెడ్డి అధ్వర్యంలో అన్నదాన సేవలు కొనసాగుతున్నాయి.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *