• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

సెల్యూట్…నిఖిల్ ! తెలంగాణ నుండి ఎంపికైన ఏకైక విద్యార్థిగా గుర్తింపు

Share Button

★ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు వనపర్తి విద్యార్థి
★తెలంగాణ నుండి ఎంపికైన ఏకైక విద్యార్థిగా గుర్తింపు
★3.12 లక్షల మందిలో అర్హత సాధించిన నిఖిల్ సాయి యాదవ్
★పుణెలోని ఎన్.డి.ఏ ప్రవేశానికి యుపిఎస్ఏ అనుమతి
★మూడేళ్ల పైలట్ శిక్షణతో పాటు బీటెక్ చదివించనున్న కేంద్ర ప్రభుత్వం

దేశం కోసం పని చేయాలనే లక్ష్యంతో నూనూగు మీసాల వయస్సులో ఓ యువకుడు నేషనల్ డిఫెన్సె అకాడమీలో అర్హత సాధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో యుద్ధ విమానాలు నడిపే పైలట్ కు శిక్షణ తీసుకోనున్నాడు.తెలంగాణ రాష్ట్రం నుంచి ఎయిర్ ఫోర్స్ కు ఎంపికైన ఏకైక విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రమ శిక్షణ, ఆలోచన,దేశభక్తి తోడైతే విజయం సాధించవచ్చని పట్టుదలతో నిరూపించాడు.ఉరిమే ఉత్సాహంతో ఉన్న ఆ యువకుడు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగి నేషనల్ డిఫెన్సె అకాడమీలో స్థానం సంపాదించుకున్నాడు.సైనిక అధికారుల పర్యవేక్షణలో మూడేళ్ల పాటు సైనిక శిక్షణ పొందనున్నాడు.నేవీ,ఆర్మీ కంటే అతికష్టంగా ఉండే ఎయిర్ ఫోర్స్ కు సంభందించిన అన్ని టెస్టులోనూ ప్రతిభ సాధించడంతో అర్హత సాధించాడు.

ఫలించిన తల్లిదండ్రుల ఆశయం

దేశానికి సేవ చేసే భాగ్యం కోసం చిన్నప్పటి నుండి కలలు గన్న ఆ యువకుడి తల్లి దండ్రుల ఆశయాలు ఫలించాయి. వనపర్తిలోని గాంధీనగర్ కాలనీకి చెందిన ఎల్ఐసి కృష్ణ ,చంద్రకళ దంపతుల కుమారుడు నిఖిల్ సాయి 2018సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా208ఆర్మీ,42 నేవీ,92ఎయిర్ ఫోర్స్ కు గానూ యూపిఎస్సి ఎన్.డి.ఏ ,ఎన్. ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించింది.ఇందులో దేశ వ్యాప్తంగా3.12 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 6800 మంది అర్హత సాధించారు.

nikhil-sai-vanaparthi2

నవంబర్ 30న ఫలితాలు విడుదల కావడంతో అర్హత సాధించిన వారికి డెహ్రాడూన్ లో సర్వీస్ సెలక్షన్ బోర్డు ఈ ఏడాది జనవరి14 నుండీ 19వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్,ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్,సైకాలజీ టెస్ట్ లో నిర్దేశిత టైం ప్రకారం నిర్వహించే టెస్ట్లు ఒక పిక్చర్ చూపించి దానిపై స్టోరీ రాయించడం,స్విచ్ వేషన్ రియాక్ట్ టెస్ట్లో 60 స్విచ్ వేషన్లను,30 నిమిషాల్లో స్టూడెంట్ 30 రియాక్షన్ లను పేర్కొనాలి,సెల్ఫ్ డిస్క్రీప్షన్,వర్డ్ అసోసియేషన్ టెస్ట్లో 15సెకండ్ లకు వచ్చే ఒక వర్డ్ పై సెంటెన్స్ రాయడం,పర్సనల్ ఇంటర్వ్యూ లో ఒక గంట మౌలికంగా నిర్వహించడం,గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ నేతృత్వంలో గ్రూప్ చర్చలు,గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్సైజ్,ప్రోగ్రెసివ్ గ్రూప్ చాట్,సెల్స్ ఆప్టికల్,గ్రూప్ ఆఫ్ కిల్ రేస్,కమాండ్ టాస్క్ లేక్చరట్,ఫైనల్ గ్రూప్ టాస్క్ మెడికల్ ఏక్సమ్ ఇలా అన్నీ టెస్ట్ లో అర్హత సాధించాడు.

అనంతరం దేశ రాజధాని ఢిల్లీలోజనవరి21 నుండి 25 వరకు ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ యష్టాబ్లిష్మెంట్ ఆసుపత్రిలో అని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతో అనింటిలో మెరుగ్గా తేలడంతోనేషనల్ డిఫెన్సె అకాడమీలో ప్రవేశానికి చోటు దక్కింది.ఇంటర్లో ఎంపీసి పూర్తిచేసిన వారు,చదువుతున్న వారు ఈ పరీక్షలు రాసేందుకు అర్హులు. ప్రతి 6నెలలకో సారి యుపిఎస్సి భారత రక్షణ శాఖ నేతృత్వంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.ఎంపికైన వారు ఎయిర్ ఫోర్స్ ఫ్లైయింగ్ అధికారి హోదాతో ఉద్యోగ జీవితం ప్రారంభం కానుంది.

మూడేళ్ల శిక్షణతో పాటు బి.టెక్

అన్నీ పరీక్షలో విజయం సాధించడంతో యుపిఎస్సి నేషనల్ డిఫెన్సె అకాడమీలో మూడేళ్ల ప్రవేశానికి చోటు కల్పిస్తూ యుపిఎస్సి ధృవీకరించింది.జూలై 2 న ఖఢక్ వాస్ లో గల ఎన్డిఏలో చేరాడు.అక్కడ మూడేళ్ల పాటుఎయిర్ ఫోర్స్ తో పాటు బి.టెక్ చేయిస్తారు.మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.శిక్షణ పూర్తయిన తరువాత ఏడాది పాటుట్రైనీ ఫ్లైయింగ్ ఆఫీసర్ గా శిక్షణ ఇస్తారు.అనంతరం అధికారికంగా నియామక పత్రం అందజేస్తారు.దీంతో యుద్ధ విమానాలు నడిపే పైలట్ గాదేశానికీ సేవ చేయాల్సి ఉంటుంది.

సంతోషంగా ఉంది

నేను దేశానికీ సేవా చేయబోతున్నాననే మాట ఎంతో సంతృప్తిని ఇస్తుంది.తల్లీదండ్రుల ఆశయాన్ని నిలబెటేందుకు పట్టుదలతో చదువుకున్నా, అదే పట్టుదలతో దేశానికీ సేవా చేస్తా.ప్రణాళికాబద్దంగా చదువుకుని ముందుకు సాగాను.ఇకపై కూడా అన్నీ పరీక్షలోనూ పూర్తిగా అర్హత సాదిస్తానన్న నమ్మకం ఉంది.

-నిఖిల్ సాయి, వనపర్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat