సీసీ కెమెరాల నిఘాలో వెల్టూర్ స్టేజి

శ్రీశైలం-హైదరాబాద్ హైవేలోని ప్రధాన రహదారి పై వెల్టూర్ స్టేజి వద్ద ఉప్పునుంతల ఎస్సై విష్ణుమూర్తి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.హైవే రోడ్డు కావున మనుషులు ఎక్కువగా సంచరించే ప్రదేశం కావడం,ప్రతి ఆదివారం సంత జరిగే ప్రాంతం కావడంతో హైవే పై ప్రమాదాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటు చేశారు.అతివేగంతోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుండడంతో వాటిని అరికట్టడంతో భాగంగా రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.వీటి ఏర్పాటుతో వాహన దారులు,ప్రయాణికులు వేగంతో వెళ్లకుండా భయంతో నిదానమే ప్రధానంగా భావించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చే విధంగా ఉందని పలువురు హర్షం వ్యక్తం చేశారు.