సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే గువ్వల
ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గ్రామానికి చెందిన గజ్జె పద్మకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయల చెక్కును అందజేశారు.ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆపరేషన్ చేయాల్సి ఉండగా ఆర్థిక పరిస్థితుల ఇబ్బంది కారణంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్షరూపాయల ఎల్ఓసిని ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.