సామాన్యుని నెత్తిన గుదిబండ
గృహ అవసరాల కోసం వినియోగించే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ రేట్లు తగ్గి నెల రోజులు దాటక ముందే మళ్లీ వాటి ధర పెరిగింది. తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధర దిల్లీలో రూ.15.5 పెంచినట్లు ప్రభుత్వరంగ ఇంధన రీటైల్ సంస్థలు తెలిపాయి. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.574.5 ఉండగా, పెరిగిన ధరతో రూ.590 కి చేరుకుంది. ఈ మార్పులు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చినట్లు ఇంధన సంస్థలు తెలిపాయి.