సస్యశ్యామలం చేసి చూపిస్తా:ఎమ్మెల్యే గువ్వల
అచ్చంపేట మండలంలోని ప్రతి ఎకరాను సాగునీటితో సస్యశ్యామలం చేసి చూపిస్తానని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. మండలంలో హజీపూర్ గ్రామంలో సర్పంచ్ అరుణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…గత కాంగ్రెస్ పాలకులు కమిషన్ల కక్కుర్తి పడి కేఎల్ఐ కాలువను పూర్తి చేయకుండా పులిజాల వద్ద ఆపేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెరాస ప్రభుత్వ హయంలోనే తెలంగాణలో ఉన్న ప్రతి ఎకరాకు,ప్రతి గుంటకు సాగు నీరు సరఫరా చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పోకల మనోహర్,మండల అధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి,తహసిల్దార్ చెన్న కిష్టన్న,ఎంపీపీ శాంత భాయి,మునిసిపల్ చైర్మన్ తులసి రామ్,తెరాస నాయకులు నరసింహ గౌడ్,ప్రతాప్ రెడ్డి,లోక్య,నిరంజన్,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.