సమ్మె శిబిరంలోనే ఆర్టీసీ కార్మికుడి రిటైర్మెంట్
మూడు దశాబ్దాలుగా ఆర్టీసీలో విధులు నిర్వహించిన ఓ కార్మికుడు సమ్మె ప్రాంగణంలోనే ఉద్యోగ విరమణ వీడ్కోలు పొందాడు.అచ్చంపేట ఆర్టీసీ డిపోలో మెకానిక్ గా పనిచేస్తున్న కెఎస్ రావు రిటైర్మెంట్ వేడుకను సమ్మె శిబిరంలోనే ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…సంస్థ కోసం మూడు దశాబ్దాలుగా పని చేసిన కార్మికుడిని గౌరవంగా డిపో నుంచి పంపించాల్సి ఉండగా ప్రభుత్వ మొండి వైఖరితో సమ్మె శిబిరంలోనే వీడ్కోలు నిర్వహించవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా కెఎస్ రావును కార్మికులు శాలువా కప్పి పూలమాలలతో సన్మానించారు.