సమ్మెను ఉధృతం చేస్తాం-ఆర్టీసీ కార్మికులు
అచ్చంపేట పట్టణంలో 31 వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగింది.ఈ సందర్బంగా అచ్చంపేట డీఎస్పీ నరసింహులు ధర్నా చేస్తున్న ప్రాంతాన్ని సోమవారం సందర్శించి ఆర్టీసీ కార్మికులతో మాట్లాడారు.ముఖ్యమంత్రి డెడ్ లైన్ రేపటితో ముగియనుంది కావున ఎవరైన కార్మికులు విధుల్లో చేరుతున్నారా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.దానికి సమాధానంగా కార్మికులు…తమ కష్టాలు,సమస్యలు తెలియజేసి, తమ డిమాండ్స్ పరిష్కరించే వరకు విధుల్లో చేరబోమని,సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఆర్టీసీ జేఏసి నిర్ణయమే తమకు శిరోధార్యమని తెలిపారు.
సోమవారం సాయంత్రం ఆర్టీసీ కార్మికులు పట్టణంలోని ధర్నా ప్రాంతం ఆర్టీసీ అమరవీరులకు నివాళులు అర్పించి అంబెడ్కర్ విగ్రహం నుండి ఆర్టీసీ డిపో వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.