సంక్షేమ వసతిగృహాల్లో అక్రమాలపై విచారణ జరిపించాలి
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అక్రమాలపై అధికారులు విచారణ చేపట్టాలని బీవిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింకారు శివాజీ డిమాండ్ చేశారు.స్థానిక బీవిఎస్ కార్యాలయంలో నిర్వహించిన విద్యార్థుల సమావేశంలో మాట్లాడుతూ…ప్రభుత్వ వసతి గృహాలు,ప్రభుత్వ పాఠశాలలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటిస్తున్న క్షేత్ర స్థాయిలో పరిస్ధితి దానికి భిన్నంగా ఉంటుందన్ని ఆయన తెలిపారు.వసతి గృహానికి సరఫరా చేసే బియ్యం పక్కదారి పడుతోందన్న ఆరోపణలు ఉన్నాయని, వండిన అన్నం ముద్దలు ముద్దలుగా మారడంతో విద్యార్థులు తినలేకపోతున్నారని అన్నారు. అధికారుల తనిఖీలు లేకపోవడంతో అక్రమాలు యధేచ్చగా జరుగుతున్నాయని అన్నారు.విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరైన ఎక్కువ మంది విద్యార్థులను నమోదు చూపి భారీ ఎత్తునఅక్రమాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.భవనాలు శిథిలావస్థకు చేరిన మరమ్మతుల పై శ్రద్ద తీసుకోవడం లేదని,కనీస వసతులు లేని అద్దె భవనాల్లో వసతి గృహాలు నిర్వహిస్తున్నారని అన్నారు. విద్యార్ధులకు పౌష్టిక ఆహారం అందించేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని,లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.