శ్రీ శ్రీ శ్రీ వెంకట లక్ష్మమ్మ తల్లి ఉత్సవాలు
అమ్రాబాద్ లో శనివారం శ్రీ వెంకట లక్ష్మమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.మండల గౌడ సంఘము అధ్యక్షుడు నోముల రామస్వామి గౌడ్ అధ్యక్షతన అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగాయి. అంతకుముందు యువకుల అధ్వర్యంలో ఉట్లు కొట్టే కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అమ్మవారి ప్రతిమను గ్రామ కూడళ్లలో ఊరేగించారు.